Thu Dec 19 2024 17:42:02 GMT+0000 (Coordinated Universal Time)
Shivaji Statue: వారికి నేను శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నా: ప్రధాని మోదీ
నరేంద్ర మోదీ శుక్రవారం క్షమాపణలు చెప్పారు
ఆగస్టు 26న మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్రలోని పాల్ఘర్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే పేరు మాత్రమే కాదని, ఈ రోజు నేను నా దేవుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి తల వంచి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని తమ ఆరాధ్యదైవంగా భావించి, తీవ్రంగా బాధపడ్డ వారికి నేను శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నానన్నారు.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని కోటలో గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 35 అడుగుల విగ్రహం ఆగస్టు 26న కూలిపోయింది. బలమైన గాలుల కారణంగా విగ్రహం కూలిపోయిందని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. సింధుదుర్గ్‌లోని రాజ్‌కోట్ కోటలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు, గత వారం భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచాయి. విగ్రహం కూలిపోవడంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రధానిని తీవ్రంగా విమర్శించాయి.
Next Story